కంటెంట్‌కు వెళ్లు

సహోదరుడు డానిల్‌ సువోరోవ్‌

డిసెంబరు 16, 2022 | అప్‌డేట్‌ అయిన తేదీ: జూన్‌ 20, 2023
రష్యా

అప్‌డేట్‌—సహోదరుణ్ణి జైల్లో వేశారు | కష్టాలున్నా సంతోషంగా ఉన్నారు

అప్‌డేట్‌—సహోదరుణ్ణి జైల్లో వేశారు | కష్టాలున్నా సంతోషంగా ఉన్నారు

2023, జూన్‌ 20న, సోచిలో ఉన్న సెంట్రాల్నీ డిస్ట్ర్‌ట్రిక్ట్‌ కోర్టు, సహోదరుడు డానిల్‌ సువోరోవ్‌ను దోషిగా తీర్పుతీర్చి, ఆరేళ్ల జైలు శిక్ష వేసింది. 2021, ఆగస్టు 18 నుండి డానిల్‌ నిర్బంధంలో ఉన్నాడు, ఇకమీదట కూడా కస్టడీలోనే ఉంటాడు.

ప్రొఫైల్‌

యెహోవా సేవలో చేయగలిగినదంతా చేస్తూ ఆయనతో దగ్గరి స్నేహాన్ని కాపాడుకుంటే, మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా సంతోషంగా ఉండగలమని తెలుసుకోవడం ప్రోత్సాహకరంగా ఉంది.—కీర్తన 16:11.

టైమ్‌లైన్‌

  1. ఆగస్టు 13, 2021

    అధికారుల తరఫున పనిచేస్తున్న ఒక వ్యక్తి బైబిలు మీద ఆసక్తి ఉన్నట్టు నమ్మించి, డానిల్‌ను పోలీసులకు పట్టించడంతో సహోదరుడి మీద క్రిమినల్‌ కేస్‌ పెట్టారు

  2. ఆగస్టు 18, 2021

    ఇంటిని సోదా చేశారు. తర్వాత అరెస్టు చేసి జైల్లో వేశారు

  3. ఆగస్టు 19, 2021

    విచారణ జరిగే వరకు వేరే జైలుకు తరలించారు

  4. ఏప్రిల్‌ 29, 2022

    తీవ్రవాద సంస్థను నడిపిస్తున్నాడని, అందులో తను పనిచేయడమే కాకుండా వేరేవాళ్లను కూడా చేరుస్తున్నాడని నేరం మోపారు.

  5. జూన్‌ 10, 2022

    నేర విచారణ మొదలైంది

a b ఈ ఆర్టికల్‌ను రాసే సమయానికి సహోదరుడు డానిల్‌ అరెస్టు అయ్యి ఉన్నాడు, కాబట్టి ఆయన మాటల్లో అడిగి తెలుసుకోలేకపోయాం.