సెప్టెంబరు 12, 2022 | అప్‌డేట్ అయిన తేదీ: జూన్ 13, 2023
రష్యా
అప్‌డేట్—సహోదరుణ్ణి దోషిగా తీర్పుతీర్చారు | అలెగ్జాండర్ షుటొవ్ సహాయం కోసం యెహోవా మీద ఆధారపడుతూనే ఉన్నాడు
2023, జూన్ 9న, ఖబరోవ్‌స్క్ ప్రాంతంలోని లాజో జిల్లా కోర్టు బ్రదర్ అలెగ్జాండర్ షుటొవ్‌ను దోషిగా తీర్పుతీర్చి, ఆయనకు వాయిదా పద్ధతిలో అమలయ్యే రెండు సంవత్సరాల ఐదు నెలలు జైలు శిక్ష వేసింది. ఆయన ఈ సమయంలో జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
టైమ్‌లైన్
జూలై 26, 2021
క్రిమినల్ కేసు ఫైల్ చేశారు
జూలై 30, 2021
ఇంటిని సోదా చేశారు. అలెగ్జాండర్‌ని అరెస్ట్ చేసి విచారణ చేశారు, ఆ తర్వాత విడుదల చేశారు. కానీ ప్రయాణించే విషయంలో కొన్ని ఆంక్షలు విధించారు
ఆగస్టు 3, 2021
రష్యా ప్రభుత్వం విపరీతవాదులు అని గుర్తించిన కొంతమంది లిస్టులో ఈయన పేరు కూడా చేర్చింది
ఏప్రిల్ 28, 2022
క్రిమినల్ కేసు కోర్టు మెట్లు ఎక్కింది
ప్రొఫైల్
హింసలు ఎక్కువౌతుండగా మనందరం ఇప్పటి నుండే మన విశ్వాసాన్ని బలపర్చుకుందాం. దేవుని విశ్వసనీయ ప్రేమ మీదే ఇప్పుడూ, ఎప్పుడూ నమ్మకం పెట్టుకోవాలని నిశ్చయించుకుందాం.—కీర్తన 52:8.